గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు
హైదరాబాద్ లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలలో విజేతలుగా నిలిచిన సుందరీమణులకు రాజ్ భవన్‌లో ఘనంగా సత్కరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో పాల్గొని విజేతలను అభినందించారు.
హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల అనంతరం, విజేతలకు రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు.
అంతకుముందు రాజ్ భవన్‌కు విచ్చేసిన మిస్ వరల్డ్ విజేత థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుచాతా చుయాంగ్ శ్రీ , ఆఫ్రికా కాంటినెంటల్ విజేత ఈథియోపియాకు చెందిన హస్సెట్ దేరేజే, యూరప్ కాంటినెంటల్ మిస్ పోలాండ్ మజ క్లాజ్డా, అమెరికన్-కరీబియన్ కాంటినెంటల్ విజేత మార్టినిక్ కు చెందిన ఆరెల్ల జోఅచ్ఛిమ్‌లకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. గిరిజనులు తయారుచేసిన అటవీ ఆకులతో రూపొందించిన స్వాగత వేదిక వద్ద మిస్ వరల్డ్ విజేతలు ఫోటోషూట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.