జై బాపు- జై భీమ్- జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర

కొల్లాపూర్ మండలంలోని ఎల్లూర్ గ్రామం నుంచి నార్లాపూర్ వరకు సాగిన జై బాపు- జై భీమ్- జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఉద్యమానికి పిలుపునిచ్చారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని వెల్లడించారుచ
నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమని మంత్రి తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ, అంబేడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.