నీచపు ఆరోపణలు కాదు,సాక్ష్యాలతో ఆధారాలు చూపెట్టు – ప్రణవ్
- ఇక నుండి కౌశిక్ రెడ్డి పేరు కచరా రెడ్డి.
- మహిళలను అడ్డుపెట్టుకొని గెలిచిన కౌశిక్ రెడ్డి అదే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం సిగ్గు చేటు.
- ఫోన్ ట్యాపింగ్ సూత్రదారులు బీఆర్ఎస్ నాయకులే..
- హుజూరాబాద్ లో ఎమ్మెల్యే పదవి వదిలేసి హైదరాబాద్ లో వాచ్ మెన్ పని చేస్తున్నావా?
మహిళలను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచి అదే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం సిగ్గు చేటని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఒడితల ప్రణవ్ అన్నారు.కౌశిక్ రెడ్డి ఆరోపణలు కాదు ఆధారాలు చూపెట్టాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని ఇకపై కౌశిక్ రెడ్డి పేరు కచరా రెడ్డి గా నామకరణం చేస్తున్నామని అన్నారు.హద్దులు దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని,హుజూరాబాద్ నియోజకవర్గాన్నీ గాలికి వదిలేసి హైదరాబాద్ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ పని చేస్తున్నాడని,ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని,ఈ విషయంపై ఆధారాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపెట్టామని గుర్తు చేశారు.ఫోన్ టాపింగ్ సూత్రధారులు బీఆర్ఎస్ నాయకులేనని కావాలంటే మీ నాయకులను అడిగితే తెలుస్తుందని ప్రణవ్ అన్నారు.తన పేరు కోసం ఇంటివాళ్ళను కూడా ఫోన్ టాపింగ్ లోకి లాగడం కౌశిక్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనమని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రుల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని,బేషరతుగా క్షమాపణ చెప్పాలని,లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
#vodithalapranav #huzurabad