December 15, 2025
  • December 15, 2025
  • Home
  • Uncategorized
  • హనుమకొండ జిల్లా సమీక్షా సమావేశం

హనుమకొండ జిల్లా సమీక్షా సమావేశం

By on June 1, 2025 0 624 Views

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి..* అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పనులు, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇల్లు పథకం, భూభారతి, వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సమగ్రంగా చర్చ జరిగింది..

ఈ సమీక్షలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, భూక్యా మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా *పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు మరియు కాంట్రాక్టర్లపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని, జాప్యం లేదా తప్పులేమీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రైతు ధాన్యం సమయానికి సేకరించబడేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు..

ఇందిరమ్మ ఇల్లు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ పథకం అన్యాయంగా అనర్హులకు చేరనీయకూడదని స్పష్టం చేశారు..

వ్యవసాయంపై మాట్లాడుతూ, నకిలీ విత్తనాల లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను మోసం చేసే అక్రమాలకు అవకాశం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, రైతులకు యూరియా వంటి ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు..

ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస, జనగామ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు..

ఈ సమీక్ష సమావేశం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, రైతుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధిపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు హరిశ్చందంగా వివరించారు..

#palakuthy #yashaswinireddy #prajapalanatelangana

Leave a comment

Your email address will not be published. Required fields are marked *