September 19, 2026
  • September 19, 2026
  • Home
  • MLA
  • Warangal West
  • రాజ్యాంగ పరిరక్షణభూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

రాజ్యాంగ పరిరక్షణభూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

By on November 7, 2017 0 890 Views
కొల్లాపూర్ నియోజక వర్గంలో కోడేరు మండల కేంద్రoలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ గోడౌన్ లో , కొల్లాపూర్ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ……ధరణి ద్వారా పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి అర్. ఓ .అర్ చట్టం 2025 ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి రోజున అమలు లోకి తీసుకు వచ్చినట్లు అన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులకు తమ భూముల విషయంలో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా జవాబుదారితనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టం చేపట్టడం జరిగిందని తెలిపారు. ధరణి లో ప్రజల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రజా ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టం-2025 తీసుకురావడం జరిగిందన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, నిషేధిత భూములు, ఆర్ ఓ ఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. ధరణి తో ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని ఇలాంటి లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం ప్రజలకు సరళంగా ఉండే విధంగా భూ భారతి చట్టాన్ని రూపొందించిందని మంత్రి తెలిపారు. ధరణి చట్టం కారణంగా నెలల తరబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేదని, వివరించారు . భూభారతి చట్టం అమలు లోకి రాకముందు ఎన్నో రకాల భూ సమస్యలతో రైతులు,సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదురుకొన్నారని తెలిపారు.భూమి హక్కు అనేది గౌరవం,అత్మ విశ్వాసం, ధైర్యం అని అన్నారు.భూమి కొనుగోలు చేసిన పట్టాదారు రికార్డు లో నమోదు కాక పోవడం కారణంగా రైతుకు బంధు,రైతు భరోసా రాలేదని తెలిపారు. సాగు చేసుకునే రైతు పేరు కాకుండా ధరణిలో ఉన్న వారే యజమానులుగా వ్యవహరిస్తున్నారు. దాన్ని ఆసరా చేసుకుని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.భూ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాక ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.భూ రికార్డులను సవరణ చేసేందుకు అధికారులకు ధరణి చట్టం లో అధికారం లేదని అన్నారు . ధరణి ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.పాస్ పుస్తకాల్లో సవరణలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.

  MLA
Leave a comment

Your email address will not be published. Required fields are marked *